TTD served annaprasadam to nearly 3.20 lakh devotees during the 10-day Vontimitta Brahmotsavams, including over 1.25 lakh devotees on the Sri Sita Rama Kalyanotsavam day alone.
Event scale
At Vontimitta / Tirupati on April 7, 2026, TTD highlighted that its annadanam arrangements during the annual Sri Kodandarama Swamy Brahmotsavams were designed to ensure that devotees received food smoothly throughout the festival. On April 1, the day of Sri Sita Rama Kalyanotsavam, annaprasadam was distributed to more than 1.25 lakh devotees, with service centers operating near the temple and at the Kalyana Mandapam.
Food arrangements
On the Kalyanotsavam day, devotees were given a food bag containing pulihora, rava kesari, mysore pak, snacks, biscuits, banana, water bottle, tetra pack, and buttermilk, making the service both convenient and large-scale. During the rest of the Brahmotsavams, TTD served pongal, upma, sambar, and chutney in the mornings, and rice, sweet pongal, curry, chutney, sambar, rasam, and buttermilk during lunch and dinner.
Daily count
The day-wise annaprasadam distribution reported for March 27 to April 5 is below.

అన్నదానం… ఆధ్యాత్మిక సేవలో అగ్రగామిగా టిటిడి మరోసారి వొంటిమిట్ట బ్రహ్మోత్సవాల్లో తన సేవా తత్వాన్ని చాటింది. మార్చి 27 నుంచి ఏప్రిల్ 5 వరకు జరిగిన 10 రోజుల ఉత్సవాల్లో సుమారు 3.20 లక్షల మంది భక్తులకు అన్నప్రసాదం పంపిణీ చేయగా, ఏప్రిల్ 1న జరిగిన శ్రీ సీతారాముల కల్యాణోత్సవం రోజు ఒక్కరోజే 1.25 లక్షల మందికి పైగా అన్నప్రసాదం అందించారు.
కల్యాణోత్సవం రోజున ఆలయం వద్ద ఉన్న కేంద్రంతో పాటు కళ్యాణ మండపం వద్ద ప్రత్యేక కేంద్రం కూడా ఏర్పాటు చేసి, ప్రతి భక్తికి అన్నప్రసాదం అందేలా టిటిడి విస్తృత ఏర్పాట్లు చేసింది. ఆ రోజు భక్తులకు పులిహోర, రవ్వ కేసరి, మైసూర్ పాక్, స్నాక్స్, బిస్కెట్ ప్యాకెట్, అరటిపండు, వాటర్ బాటిల్, టెట్రా ప్యాక్, మజ్జిగ ఉన్న బ్యాగ్‌ను అందించారు.
ఉత్సవాల మిగతా రోజులలో ఉదయం పొంగల్, ఉప్మా, సాంబార్, చట్నీ, మధ్యాహ్నం మరియు రాత్రి అన్నం, స్వీట్ పొంగల్, కూర, చట్నీ, సాంబార్, రసం, మజ్జిగ వడ్డించారు. ఈ భారీ అన్నదాన కార్యక్రమం భక్తుల సేవే లక్ష్యంగా నిర్వహించబడిందని, దీనికి విశేష ప్రశంసలు లభించాయని టిటిడి తెలిపింది.


