తిరుపతి / దేవుని కడప, ఆగస్టు 23, 2026: దేవుని కడపలోని శ్రీ లక్ష్మీ వేంకటేశ్వరస్వామి ఆలయ జీర్ణోద్ధరణ, అష్టబంధన మహాసంప్రోక్షణానికి ఆదివారం సాయంత్రం అంకురార్పణను ఆగమోక్తంగా నిర్వహించారు.
వేద మంత్రోచ్ఛారణల నడుమ ప్రత్యేక క్రతువులు
అంకురార్పణలో భాగంగా వాస్తుశాంతి, మృత్సంగ్రహణం, కుంభారాధన, అంకురార్పణం తదితర క్రతువులను వేద మంత్రోచ్ఛారణల నడుమ సంప్రదాయబద్ధంగా నిర్వహించారు.
ఆగస్టు 24న శాంతి హోమం, కుంభస్థాపన
ఆగస్టు 24న శాంతి హోమం, కుంభస్థాపన, పంచాగ్ని ప్రణయనం తదితర వేద క్రతువులను నిర్వహించనున్నారు.
ఆగస్టు 25న అష్టబంధనం
ఆగస్టు 25న ఏకాశీతి కలశ స్నపనం, మూర్తి హోమం, అష్టబంధనం తదితర క్రతువులను నిర్వహించనున్నారు.
సాయంత్రం శయాధివాసం, శాంతి హోమం నిర్వహించనున్నారు.
ఆగస్టు 26న మహాసంప్రోక్షణం
ఆగస్టు 26న ఉదయం నిర్వహించే క్రతువుల అనంతరం ఉదయం 9:45 గంటల నుంచి 11:30 గంటల వరకు మహా పూర్ణాహుతి, మహాసంప్రోక్షణం నిర్వహించనున్నారు.
ఈ పవిత్ర కార్యక్రమం శ్రవణ నక్షత్రం, తులా లగ్నంలో నిర్వహించనున్నారు.
మహాసంప్రోక్షణం అనంతరం భక్తులకు దర్శనం
మహాసంప్రోక్షణ కార్యక్రమం పూర్తయిన అనంతరం భక్తులకు శ్రీ లక్ష్మీ వేంకటేశ్వరస్వామివారి దర్శనానికి అనుమతి కల్పించనున్నారు.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవో శ్రీమతి ఎ. ప్రశాంతి, ఏఈవో శ్రీ రవి, సూపరింటెండెంట్ శ్రీ హనుమంతయ్య, ఆలయ ఇన్‌స్పెక్టర్ శ్రీ ఈశ్వర్ రెడ్డి, ఆలయ అర్చకులు పాల్గొన్నారు.
💬 వ్యాఖ్యలు