తిరుపతి / దేవుని కడప, ఆగస్టు 24, 2026: దేవుని కడపలోని శ్రీ లక్ష్మీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో జీర్ణోద్ధారణ అష్టబంధన మహాసంప్రోక్షణ క్రతువులు సోమవారం భక్తిశ్రద్ధలు, సాంప్రదాయబద్ధమైన ధార్మిక వాతావరణంలో ఘనంగా ప్రారంభమయ్యాయి.
ఆగమ సంప్రదాయాల ప్రకారం పవిత్ర క్రతువులు
తొలిరోజు కార్యక్రమాల్లో భాగంగా అర్చకులు ఉదయం 8 గంటల నుంచి మనోన్మన ప్రమాణ శాంతి హోమం, కుంభస్థాపన, పంచాగ్ని ప్రణయనం, సత్తుమొర తదితర క్రతువులను ఆగమ సంప్రదాయాల ప్రకారం నిర్వహించారు.
సాయంత్రం 6:30 గంటలకు యాగశాలలో ప్రత్యేక వేద క్రతువులు నిర్వహించనున్నారు.
ఆగస్టు 25న అష్టబంధనం
ఆగస్టు 25న ఉదయం 7:30 గంటల నుంచి చతుష్ఠానార్చన, ఏకాశీతి కలశ స్నపనం, మూర్తి హోమం, అష్టబంధనం నిర్వహించనున్నారు.
సాయంత్రం 6 గంటల నుంచి శయాధివాసం, తత్త్వ హోమాలు, శాంతి హోమం, సత్తుమొర నిర్వహిస్తారు.
ఆగస్టు 26న మహాసంప్రోక్షణం
ఆగస్టు 26న ఉదయం 7 గంటల నుంచి చతుష్ఠానార్చన, మూర్తి హోమం, ప్రాయశ్చిత్త హోమం నిర్వహించనున్నారు.
అనంతరం ఉదయం 9:45 గంటల నుంచి 11:30 గంటల వరకు మహా పూర్ణాహుతి, మహాసంప్రోక్షణం, కలాకర్షణం ఆగమ సంప్రదాయాల ప్రకారం నిర్వహించనున్నారు.
ఈ పవిత్ర క్రతువులు శ్రవణ నక్షత్రం, తులా లగ్నంలో నిర్వహించనున్నారు.
మహాసంప్రోక్షణం అనంతరం భక్తులకు దర్శనం
మహాసంప్రోక్షణ క్రతువులు పూర్తయిన అనంతరం భక్తులకు శ్రీ లక్ష్మీ వేంకటేశ్వరస్వామివారి దర్శనానికి అనుమతి కల్పించనున్నారు.
ఈ పవిత్ర కార్యక్రమాల్లో ఏఈవో శ్రీ రవి, సూపరింటెండెంట్ శ్రీ హనుమంతయ్య, ఆలయ ఇన్‌స్పెక్టర్ శ్రీ ఈశ్వర్ రెడ్డి, ఆలయ అర్చకులు పాల్గొన్నారు.
💬 వ్యాఖ్యలు