తిరుపతి / దేవుని కడప, ఆగస్టు 22, 2026: దేవుని కడపలోని శ్రీ లక్ష్మీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో జీర్ణోద్ధారణ అష్టబంధన మహాసంప్రోక్షణానికి ఆగస్టు 23న ఆగమోక్తంగా అంకురార్పణ నిర్వహించనున్నారు.
ఆగస్టు 23 నుంచి 26 వరకు ప్రత్యేక క్రతువులు
జీర్ణోద్ధారణ అష్టబంధన మహాసంప్రోక్షణంలో భాగంగా ఆగస్టు 23 నుంచి 26 వరకు పలు ఆగమోక్త క్రతువులను నిర్వహించనున్నారు.
ఆగస్టు 26న ఉదయం 9:45 గంటల నుంచి 11:30 గంటల వరకు మహాసంప్రోక్షణ కార్యక్రమం నిర్వహించనున్నారు.
ఆగస్టు 26 మధ్యాహ్నం నుంచి మూలవిరాట్టు దర్శనం
మహాసంప్రోక్షణ కార్యక్రమం పూర్తయిన అనంతరం ఆగస్టు 26 మధ్యాహ్నం నుంచి భక్తులకు మూలవిరాట్టు దర్శనానికి అనుమతి కల్పించనున్నారు.
ఈ పవిత్ర క్రతువుల్లో భక్తులు పాల్గొని శ్రీ లక్ష్మీ వేంకటేశ్వరస్వామివారి దివ్య ఆశీస్సులు పొందాలని కోరారు.
💬 వ్యాఖ్యలు