తిరుమల, ఆగస్టు 19, 2026: హైదరాబాద్‌కు చెందిన డా. పి. శిల్ప, డా. శ్రీధర్ రెడ్డి దంపతులు టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీ వేంకటేశ్వర ప్రాణదాన ట్రస్ట్‌కు రూ.15 లక్షలు విరాళంగా బుధవారం అందించారు.
టీటీడీ అదనపు ఈవోకు విరాళం చెక్కు అందజేత
దాతలు రూ.15 లక్షల విరాళం చెక్కును టీటీడీ అదనపు ఈవో శ్రీ చ. వెంకయ్య చౌదరికి తిరుమలలోని అదనపు ఈవో క్యాంప్ కార్యాలయంలో అందజేశారు.
శ్రీ వేంకటేశ్వర ప్రాణదాన ట్రస్ట్ సేవా కార్యక్రమాలకు మద్దతుగా ఈ విరాళాన్ని అందించినట్లు తెలిపారు.
💬 వ్యాఖ్యలు