తిరుపతి/విజయవాడ, జూలై 7, 2026: జూలై 8న నిర్వహించనున్న వార్షిక ఆలయ ఉత్సవాలకు ముందుగా విజయవాడ శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో టీటీడీ ఆధ్వర్యంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం మంగళవారం భక్తిశ్రద్ధల మధ్య నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణం, గర్భగుడిని పవిత్ర జలాలు, సాంప్రదాయ సుగంధ ద్రవ్యాలు, ఔషధ మిశ్రమాలతో ఆగమశాస్త్రోక్తంగా శుద్ధి చేసి పవిత్రీకరించారు.
తిరుమంజనం అనంతరం భక్తులకు స్వామివారి దర్శనం కల్పించారు.
జూలై 8న వార్షిక ఆలయ ఉత్సవం
జూలై 8న వార్షిక ఆలయ ఉత్సవాల సందర్భంగా:
🙏 అష్టోత్తర శత కలశాభిషేకం
🔥 మహాశాంతి హోమం
🌧️ వర్ష వర్ధన హోమం
💧 మహా స్నపనం
🪔 పూర్ణాహుతి
వంటి విశిష్ట వైదిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
భక్తులకు టీటీడీ ఆహ్వానం
ఈ పవిత్ర ఉత్సవాల్లో పెద్ద సంఖ్యలో పాల్గొని శ్రీ వేంకటేశ్వరస్వామివారి దివ్య ఆశీస్సులు పొందాలని టీటీడీ భక్తులకు విజ్ఞప్తి చేసింది.
💬 వ్యాఖ్యలు