తిరుమల, జూలై 17, 2026: అనివార ఆస్థానం ఉత్సవాల్లో భాగంగా శ్రీ మలయప్పస్వామివారు శ్రీదేవి, భూదేవి సమేతంగా శుక్రవారం సాయంత్రం సుందరంగా పుష్పాలతో అలంకరించిన పుష్ప పల్లకిపై నాలుగు మాడ వీధుల్లో భక్తులకు దివ్య దర్శనమిచ్చారు.
పుష్పాలతో కళకళలాడిన పల్లకి, ఆధ్యాత్మిక వాతావరణం భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
"గోవింద... గోవింద..." నామస్మరణలతో మారుమోగిన మాడ వీధులు
సాయంత్రం చిరుజల్లులు కురుస్తున్నప్పటికీ వేలాది మంది భక్తులు నాలుగు మాడ వీధుల్లోని గ్యాలరీలను పూర్తిగా నింపి స్వామివారి వాహనసేవను తిలకించారు.
భక్తుల "గోవింద... గోవింద..." నామస్మరణలతో తిరుమల ఆధ్యాత్మిక ఉత్సాహంతో మారుమోగింది.
కార్యక్రమంలో పాల్గొన్న అధికారులు
ఈ కార్యక్రమంలో టీటీడీ ఈవో శ్రీ ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో శ్రీ చి. వెంకయ్య చౌదరితో పాటు ఇతర టీటీడీ అధికారులు పాల్గొన్నారు.
💬 వ్యాఖ్యలు