భక్తుల నుంచి టీటీడీ పేరుతో డబ్బులు వసూలు చేసిన ఉద్యోగిపై సస్పెన్షన్ వేటు

తిరుపతి, జూలై 25, 2026: హర్యానాలోని కురుక్షేత్ర శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో అసిస్టెంట్ షరాఫ్‌గా పనిచేస్తున్న పి.

✍ Admin · 📅 28 Jul 2026 · ⏱ 1 min read · 👁 13
TTD Suspends Employee for Collecting Money from Devotees in the Name of Temple Services

తిరుపతి, జూలై 25, 2026: హర్యానాలోని కురుక్షేత్ర శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో అసిస్టెంట్ షరాఫ్‌గా పనిచేస్తున్న పి. గిరి అనే ఉద్యోగిని టీటీడీ శనివారం సస్పెండ్ చేసింది.

టీటీడీ విజిలెన్స్ నిర్వహించిన విచారణలో, సదరు ఉద్యోగి టీటీడీ పేరుతో భక్తుల నుంచి అన్నదానం, కల్యాణోత్సవం, వాహన సేవల పేర్లపై డబ్బులు వసూలు చేసినట్లు తేలింది.

టీటీడీ క్రమశిక్షణ చర్య

విజిలెన్స్ విచారణ నివేదిక ఆధారంగా సదరు ఉద్యోగిపై సస్పెన్షన్ వేటు వేస్తూ టీటీడీ క్రమశిక్షణ చర్యలు చేపట్టింది.

భక్తుల విశ్వాసాన్ని కాపాడటం, టీటీడీ సేవల్లో పారదర్శకతను కొనసాగించడం, టీటీడీ పేరుతో ఎలాంటి అనధికారిక వసూళ్లను సహించబోమనే సందేశాన్ని ఈ చర్య ద్వారా టీటీడీ స్పష్టం చేసింది.

భాషను మార్చండి: 🇬🇧 English 🇮🇳 తెలుగు
🙏 ఈ వార్త మీకు నచ్చిందా? మీ కుటుంబ WhatsApp గ్రూపులో పంచుకోండి — శ్రీవారి కృప మరిన్ని భక్తులకు చేరనివ్వండి.
📣 షేర్ చేయండి Telegram 𝕏 Facebook

✉️ తిరుమల వార్తల న్యూస్‌లెటర్

రోజువారీ దర్శనం అప్‌డేట్‌లు, పండుగ రిమైండర్‌లు, టోకెన్ విడుదల అలర్ట్‌లు — నేరుగా మీ ఇన్‌బాక్స్‌లో.

స్పామ్ లేదు. 1 క్లిక్‌లో అన్‌సబ్‌స్క్రైబ్.

💬 వ్యాఖ్యలు

మొదటి వ్యాఖ్య మోడరేషన్ తర్వాత కనిపిస్తుంది
⏳ లోడ్ అవుతోంది…
© 2026 Tirumalainfo.com · All news · 📚 Saved · Live status · Terms · Privacy