అలిపిరి కాలిబాటలో ధూమపానంపై టీటీడీ హెచ్చరిక – నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు

తిరుమల, ఆగస్టు 16, 2026: టీటీడీ నిబంధనలకు విరుద్ధంగా అలిపిరి కాలిబాటలో ఓ వ్యక్తి ధూమపానం చేసినట్లు టీటీడీకి సమాచారం అందింది.

✍ Admin · 📅 17 Aug 2026 · ⏱ 1 min read · 👁 20
TTD Warns Against Smoking and Intoxicant Use on Alipiri Walking Path

తిరుమల, ఆగస్టు 16, 2026: టీటీడీ నిబంధనలకు విరుద్ధంగా అలిపిరి కాలిబాటలో ఓ వ్యక్తి ధూమపానం చేసినట్లు టీటీడీకి సమాచారం అందింది.

ఈ ఘటనపై సంబంధిత వ్యక్తిపై పోలీసులకు ఫిర్యాదు చేసి, తగిన చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు టీటీడీ తెలిపింది.

మద్యం, ధూమపానం, గుట్కా, మత్తు పదార్థాలు నిషేధం

టీటీడీ నిబంధనల ప్రకారం తిరుమల, అలిపిరి, శ్రీవారి మెట్టు, టీటీడీ పరిధిలోని ఇతర ప్రాంతాల్లో మద్యం సేవించడం, ధూమపానం చేయడం, మత్తు పదార్థాలు, గుట్కా వినియోగించడం పూర్తిగా నిషేధం.

తిరుమల యాత్రా ప్రాంతాల పవిత్రత, ఆధ్యాత్మిక వాతావరణాన్ని కాపాడేందుకు ఈ నిబంధనలు అమలు చేస్తున్నట్లు టీటీడీ తెలిపింది.

నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు

నిబంధనలు ఉన్నప్పటికీ కాలిబాటలో ధూమపానం చేయడం భక్తుల మనోభావాలను దెబ్బతీయడంతో పాటు పవిత్రతకు విఘాతం కలిగించే చర్యగా టీటీడీ పేర్కొంది.

టీటీడీ నిబంధనలను ఉల్లంఘించే వారిపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని మరోసారి స్పష్టం చేసింది.

అలాగే తనిఖీలు నిర్వహించడంలో భద్రతా సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లు తేలితే వారిపై కూడా క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని టీటీడీ హెచ్చరించింది.

భాషను మార్చండి: 🇬🇧 English 🇮🇳 తెలుగు
🙏 ఈ వార్త మీకు నచ్చిందా? మీ కుటుంబ WhatsApp గ్రూపులో పంచుకోండి — శ్రీవారి కృప మరిన్ని భక్తులకు చేరనివ్వండి.
📣 షేర్ చేయండి Telegram 𝕏 Facebook

✉️ తిరుమల వార్తల న్యూస్‌లెటర్

రోజువారీ దర్శనం అప్‌డేట్‌లు, పండుగ రిమైండర్‌లు, టోకెన్ విడుదల అలర్ట్‌లు — నేరుగా మీ ఇన్‌బాక్స్‌లో.

స్పామ్ లేదు. 1 క్లిక్‌లో అన్‌సబ్‌స్క్రైబ్.

💬 వ్యాఖ్యలు

మొదటి వ్యాఖ్య మోడరేషన్ తర్వాత కనిపిస్తుంది
⏳ లోడ్ అవుతోంది…
© 2026 Tirumalainfo.com · All news · 📚 Saved · Live status · Terms · Privacy