తిరుమల, జూలై 17, 2026: అనివార ఆస్థానం సందర్భంగా తమిళనాడులోని ప్రసిద్ధ శ్రీ రంగనాథస్వామి ఆలయం, శ్రీరంగం నుంచి తీసుకొచ్చిన పవిత్ర పట్టువస్త్రాలను శుక్రవారం శ్రీ వేంకటేశ్వరస్వామివారికి సంప్రదాయబద్ధంగా సమర్పించారు.
శ్రీరంగం మరియు తిరుమల వైష్ణవ సంప్రదాయాల మధ్య ఉన్న ఆధ్యాత్మిక అనుబంధానికి ఈ కార్యక్రమం ప్రతీకగా నిలుస్తుంది.
పెద్ద జీయర్ మఠంలో ప్రత్యేక పూజలు
ముందుగా శ్రీ బేడి ఆంజనేయస్వామి ఆలయం పక్కన ఉన్న తిరుమల పెద్ద జీయర్ స్వామి మఠంలో పవిత్ర పట్టువస్త్రాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం పెద్ద జీయర్ స్వామి, చిన్న జీయర్ స్వామి, టీటీడీ ఈవో శ్రీ ముద్దాడ రవిచంద్ర, తమిళనాడు హిందూ మత మరియు ధర్మాదాయ శాఖ మంత్రి శ్రీ రమేష్, కమిషనర్ శ్రీ వినయ్ ఆధ్వర్యంలో వేదమంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ పట్టువస్త్రాలను ఆలయానికి ఊరేగింపుగా తీసుకువెళ్లారు.
శ్రీవారికి పట్టువస్త్రాల సమర్పణ
ఆలయానికి చేరుకున్న అనంతరం పవిత్ర పట్టువస్త్రాలను శ్రీ వేంకటేశ్వరస్వామివారికి భక్తిశ్రద్ధలతో సమర్పించారు.
ఈ కార్యక్రమంలో టీటీడీ అదనపు ఈవో శ్రీ చి. వెంకయ్య చౌదరి, తమిళనాడు హెచ్‌ఆర్ & సీఈ జాయింట్ కమిషనర్ శ్రీ రవిచంద్ర, శ్రీరంగం ఆలయ ఈవో శ్రీ శివరాం కుమార్, ప్రధాన అర్చకులు శ్రీ సుందర భట్టార్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
💬 వ్యాఖ్యలు