సురుటుపల్లి శ్రీ పల్లికొండేశ్వర స్వామివారిని దర్శించుకున్న టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు

తిరుపతి, ఆగస్టు 3, 2026: తిరుపతి జిల్లా సురుటుపల్లిలోని ప్రసిద్ధ శ్రీ పల్లికొండేశ్వర స్వామివారి ఆలయాన్ని టీటీడీ ఛైర్మన్ శ్రీ బీఆర్ నాయుడు దంపతులు సోమవారం…

✍ Admin · 📅 07 Aug 2026 · ⏱ 1 min read · 👁 101
TTD Chairman B.R. Naidu Offers Prayers at Sri Pallikondeswara Swamy Temple

తిరుపతి, ఆగస్టు 3, 2026: తిరుపతి జిల్లా సురుటుపల్లిలోని ప్రసిద్ధ శ్రీ పల్లికొండేశ్వర స్వామివారి ఆలయాన్ని టీటీడీ ఛైర్మన్ శ్రీ బీఆర్ నాయుడు దంపతులు సోమవారం దర్శించుకుని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఆలయానికి చేరుకున్న టీటీడీ ఛైర్మన్ దంపతులకు ఆలయ ఛైర్మన్ శ్రీ పద్మనాభ రాజు, కార్యనిర్వహణాధికారి శ్రీమతి లత పూర్ణకుంభం, మంగళ వాయిద్యాలతో సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు.

ప్రజల సంక్షేమం కోసం ప్రత్యేక పూజలు

అనంతరం శ్రీ సర్వమంగళాదేవి సమేత శ్రీ పల్లికొండేశ్వర స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ప్రజల సంక్షేమం, సనాతన ధర్మ పరిరక్షణ కోసం స్వామివారిని ప్రార్థించారు.

ఉప ఆలయాల్లో దర్శనం

అంతకుముందు టీటీడీ ఛైర్మన్:

ఆలయాలను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అనంతరం ఆలయ సంప్రదాయం ప్రకారం శ్రీ ప్రదోష నంది మండపంలో వేద పండితులు టీటీడీ ఛైర్మన్ దంపతులకు వేదాశీర్వచనం అందించారు.

ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యులు శ్రీ నరేష్, శ్రీ శాంతారామ్, ఆలయ అధికారులు పాల్గొన్నారు.

భాషను మార్చండి: 🇬🇧 English 🇮🇳 తెలుగు
✨ దైవ సమాచారాన్ని విస్తరించడంలో సహాయపడండి — తెలుసుకోవాలనే వారికి పంచుకోండి.
📣 షేర్ చేయండి Telegram 𝕏 Facebook

✉️ తిరుమల వార్తల న్యూస్‌లెటర్

రోజువారీ దర్శనం అప్‌డేట్‌లు, పండుగ రిమైండర్‌లు, టోకెన్ విడుదల అలర్ట్‌లు — నేరుగా మీ ఇన్‌బాక్స్‌లో.

స్పామ్ లేదు. 1 క్లిక్‌లో అన్‌సబ్‌స్క్రైబ్.

💬 వ్యాఖ్యలు

మొదటి వ్యాఖ్య మోడరేషన్ తర్వాత కనిపిస్తుంది
⏳ లోడ్ అవుతోంది…
© 2026 Tirumalainfo.com · All news · 📚 Saved · Live status · Terms · Privacy