తిరుమలలో ఘనంగా గరుడ పంచమి గరుడ వాహనసేవ – భక్తులను కటాక్షించిన శ్రీ మలయప్పస్వామివారు

తిరుమల, ఆగస్టు 17, 2026: గరుడ పంచమి పర్వదినాన్ని పురస్కరించుకుని సోమవారం తిరుమలలో శ్రీ మలయప్పస్వామివారు తమ ఇష్టవాహనమైన గరుడునిపై తిరుమాడ వీధుల్లో విహరించి…

✍ Admin · 📅 18 Aug 2026 · ⏱ 1 min read · 👁 109
Garuda Panchami Garuda Vahana Seva Held Grandly at Tirumala

తిరుమల, ఆగస్టు 17, 2026: గరుడ పంచమి పర్వదినాన్ని పురస్కరించుకుని సోమవారం తిరుమలలో శ్రీ మలయప్పస్వామివారు తమ ఇష్టవాహనమైన గరుడునిపై తిరుమాడ వీధుల్లో విహరించి భక్తులను కటాక్షించారు.

రాత్రి 7 గంటలకు గరుడ వాహనసేవ ప్రారంభమైంది. శ్రీవారి గరుడ వాహనసేవను దర్శించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తిరుమాడ వీధులకు తరలివచ్చారు.

శ్రీవారి వాహనాల్లో గరుడుడిదే అగ్రస్థానం

శ్రీవారి వాహనాల్లోను, సేవకుల్లోను గరుడుడు అగ్రగణ్యుడిగా భావిస్తారు.

ప్రతి ఏడాది శుక్ల పక్షం ఐదవ రోజున గరుడ పంచమిని ఘనంగా నిర్వహిస్తారు. ఈ పర్వదినానికి వైష్ణవ సంప్రదాయంలో ప్రత్యేక ఆధ్యాత్మిక ప్రాధాన్యత ఉంది.

గరుడ పంచమి పూజకు విశిష్టత

గరుడ పంచమి సందర్భంగా నూతన దంపతులు తమ వైవాహిక జీవితం ఆనందదాయకంగా ఉండాలని కోరుకుంటూ గరుడ పంచమి పూజను నిర్వహిస్తారు.

అలాగే స్త్రీలు తమకు పుట్టే సంతానం గరుడునిలా బలశాలిగా, ధైర్యవంతంగా ఉండాలని ఆకాంక్షిస్తూ భక్తిశ్రద్ధలతో ఈ పూజను నిర్వహిస్తారు.

గరుడ వాహనసేవలో జీయర్ స్వాములు, టీటీడీ అధికారులు

గరుడ వాహనసేవలో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్ స్వామి, టీటీడీ అదనపు ఈవో శ్రీ సి.హెచ్. వెంకయ్య చౌదరితో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు.

భాషను మార్చండి: 🇬🇧 English 🇮🇳 తెలుగు
📿 ఈ వార్త మీ హృదయాన్ని తాకింది అయితే, తిరుమల యాత్రకు ప్లాన్ చేస్తున్న ఇతర భక్తులకు పంచుకోండి.
📣 షేర్ చేయండి Telegram 𝕏 Facebook

✉️ తిరుమల వార్తల న్యూస్‌లెటర్

రోజువారీ దర్శనం అప్‌డేట్‌లు, పండుగ రిమైండర్‌లు, టోకెన్ విడుదల అలర్ట్‌లు — నేరుగా మీ ఇన్‌బాక్స్‌లో.

స్పామ్ లేదు. 1 క్లిక్‌లో అన్‌సబ్‌స్క్రైబ్.

💬 వ్యాఖ్యలు

మొదటి వ్యాఖ్య మోడరేషన్ తర్వాత కనిపిస్తుంది
⏳ లోడ్ అవుతోంది…
© 2026 Tirumalainfo.com · All news · 📚 Saved · Live status · Terms · Privacy