తిరుమల, ఆగస్టు 16, 2026: రాష్ట్రంతో పాటు దేశవ్యాప్తంగా సమృద్ధిగా వర్షాలు కురవాలని ఆకాంక్షిస్తూ, దైవ అనుగ్రహం కోసం టీటీడీ కరిష్ఠి యాగం, వరుణ జపం, పర్జన్య శాంతి హోమాన్ని తిరుమలలో ఆగస్టు 30 నుంచి సెప్టెంబర్ 3 వరకు నిర్వహించనుంది.
ధర్మగిరి వేద విజ్ఞాన పీఠంలో వైదిక కార్యక్రమాలు
ఈ వైదిక కార్యక్రమాలను తిరుమలలోని ధర్మగిరి వేద విజ్ఞాన పీఠంలో నిర్వహించనున్నారు.
యాగం, సంబంధిత వైదిక కార్యక్రమాలకు సంబంధించిన ఏర్పాట్లను ప్రిన్సిపాల్ శ్రీ కుప్ప శివ సుబ్రహ్మణ్య అవధాని పర్యవేక్షణలో చేస్తున్నారు.
32 మంది వైదిక పండితుల భాగస్వామ్యం
ఈ యాగం, అనుబంధ వైదిక కార్యక్రమాల్లో 32 మంది వేద, శ్రౌత, స్మార్త పండితులు పాల్గొననున్నారు.
ప్రజల సంక్షేమం, సుభిక్షం కోసం సకాలంలో సమృద్ధిగా వర్షాలు కురవాలని ఆకాంక్షిస్తూ నిర్దేశిత వైదిక సంప్రదాయాల ప్రకారం ఈ కార్యక్రమాలను నిర్వహించనున్నారు.
సెప్టెంబర్ 3న మహాపూర్ణాహుతి
ఆగస్టు 30 నుంచి ప్రారంభమయ్యే ఈ వైదిక కార్యక్రమాలు సెప్టెంబర్ 3న మహాపూర్ణాహుతితో ముగియనున్నాయి.
💬 వ్యాఖ్యలు