తిరుమల, నవంబర్ 5, 2026: తిరుమలలో నూతనంగా ఆధునీకరించి పునరుద్ధరించిన శ్రీ వేంకటేశ్వర మ్యూజియం ట్రయల్ రన్‌ను టీటీడీ నవంబర్ 15వ తేదీ వరకు పొడిగించింది.
ఈ పొడిగించిన ట్రయల్ రన్ సమయంలో ఎంపిక చేసిన వర్గాలకు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉచితంగా మ్యూజియం సందర్శించే అవకాశం కల్పించారు.
ఉచితంగా మ్యూజియం సందర్శించేందుకు అర్హులు
ట్రయల్ రన్ సమయంలో కింది వర్గాల వారు ఉచితంగా మ్యూజియాన్ని సందర్శించవచ్చు:
-
టీటీడీ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు
-
తిరుమల, తిరుపతిలో పనిచేస్తున్న మీడియా ప్రతినిధులు, వారి కుటుంబ సభ్యులు
-
టీటీడీ విద్యాసంస్థల విద్యార్థులు
-
శ్రీవారి సేవకులు
అర్హులైన వారు నవంబర్ 15 వరకు ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు మ్యూజియాన్ని సందర్శించవచ్చు.
నవంబర్ 16 నుంచి భక్తులకు అనుమతి
ట్రయల్ రన్ పూర్తయిన అనంతరం నవంబర్ 16, 2026 నుంచి భక్తులకు మ్యూజియం సందర్శనకు అనుమతి కల్పించనున్నారు.
మ్యూజియం ప్రవేశ రుసుమును ఒక్కొక్కరికి రూ.50గా టీటీడీ నిర్ణయించింది.
ట్రయల్ రన్ సమయంలో ఉచిత సందర్శనకు అర్హులైన వారందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని టీటీడీ కోరింది.
💬 వ్యాఖ్యలు